తెలుగు ఎడిషన్ · 2 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
యాదాద్రి లక్ష్మీనరసింహుడి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌. మహాదేవన్అంతరిక్షంలోకి గూగుల్ AI చిప్‌లు.. స్పేస్‌ఎక్స్ రాకెట్‌తో నింగిలోకితెలంగాణ ప్రజా రవాణాలో డిజిటల్ విప్లవంమెడికల్ షాపులో అక్రమ దందా.. తెల్లాపూర్‌లో భారీగా ట్రామాడాల్ సీజ్గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి: నివాళులర్పించిన సీఎం చంద్రబాబుకరీంనగర్ జిల్లాజాతిపితకు ఘన నివాళి.. బాపూ ఘాట్ వద్ద గవర్నర్, సీఎం.హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు ఇస్తారిబాయి కుంట రక్షణయాదాద్రి లక్ష్మీనరసింహుడి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌. మహాదేవన్అంతరిక్షంలోకి గూగుల్ AI చిప్‌లు.. స్పేస్‌ఎక్స్ రాకెట్‌తో నింగిలోకితెలంగాణ ప్రజా రవాణాలో డిజిటల్ విప్లవంమెడికల్ షాపులో అక్రమ దందా.. తెల్లాపూర్‌లో భారీగా ట్రామాడాల్ సీజ్గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి: నివాళులర్పించిన సీఎం చంద్రబాబుకరీంనగర్ జిల్లాజాతిపితకు ఘన నివాళి.. బాపూ ఘాట్ వద్ద గవర్నర్, సీఎం.హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు ఇస్తారిబాయి కుంట రక్షణ
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలంగాణ ప్రజా రవాణాలో డిజిటల్ విప్లవం

ప్రత్యేక కథనంజాతీయం
తెలంగాణ ప్రజా రవాణాలో డిజిటల్ విప్లవం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆర్టీసీ–మెట్రో ఉమ్మడి పాస్, ‘MeeTicket’ యాప్ ప్రారంభం

కామన్ పాస్ ద్వారా రేపు బేగంపేట నుండి మెట్రోలో అనంతరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు

హైదరాబాద్: తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా, సమగ్రంగా, ప్రయాణికులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. తెలంగాణ ప్రభుత్వం, TGSRTC, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) సంయుక్తంగా ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్, ‘MeeTicket’ మొబైల్ యాప్, డిజిటల్ వీక్లీ బస్ పాస్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

హైదరాబాద్ ప్రజాభవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కామన్ పాస్, MeeTicket యాప్, డిజిటల్ వీక్లీ బస్ పాస్‌లను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఒకే పాస్‌తో ఆర్టీసీ -మెట్రో ప్రయాణం

హైదరాబాద్‌లో ప్రతిరోజూ భారీ సంఖ్యలో ప్రజలు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లను వినియోగిస్తున్న నేపథ్యంలో రెండు ప్రజా రవాణా వ్యవస్థలను అనుసంధానం చేస్తూ కామన్ పాస్‌ను ప్రవేశపెట్టారు.

ఈ పాస్‌తో ORR పరిధిలో నడిచే TGSRTC సిటీ బస్సుల్లో (పుష్పక్ మినహా), మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. కామన్ పాస్‌లు అన్ని మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంటాయి. మొదటిసారి కార్డు తీసుకునేటప్పుడు రూ.100 డిపాజిట్ చెల్లించాలి. కార్డును తిరిగి అప్పగించినప్పుడు ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు.

కామన్ పాస్ ధరలు:

రోజువారీ పాస్ - రూ.400

మెట్రో - రూ.300

ఆర్టీసీ - రూ.100

నెలవారీ పాస్ - రూ.8,500

మెట్రో - రూ.7,000

ఆర్టీసీ - రూ.1,500

ఈ కామన్ పాస్ ద్వారా మెట్రో స్టేషన్ల నుంచి నివాస, వాణిజ్య ప్రాంతాలకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ మరింత సులభతరం కానుంది. ప్రజా రవాణా వినియోగం పెరగడం ద్వారా ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యం తగ్గించేందుకు కూడా ఇది దోహదపడుతుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు