గ్లోబల్ మార్కెట్లలో కొవిడ్ స్థాయి భారీ పతనం. గ్లోబల్ మార్కెట్లలో కొవిడ్ స్థాయి భారీ పతనం

గ్లోబల్ మార్కెట్లను అమ్మకాల సునామీ ముంచెత్తింది. కొవిడ్ కాలం తర్వాత అమెరికా నాస్‌డాక్ సూచీ అత్యంత తీవ్రమైన పతనాన్ని నమోదు చేసింది.
టెక్, చిప్ తయారీ సంస్థల షేర్లు 2020 మార్చి తర్వాత కనిష్ఠ స్థాయికి పడిపోయి మార్కెట్లను కుదిపేశాయి.
ఆసియా మార్కెట్లలో కొరియా కోస్పీ సూచీ లోయర్ సర్క్యూట్ తాకగా, జపాన్, తైవాన్ సూచీలు బేర్ మార్కెట్ పరిధిలోకి వెళ్లాయి.
మాంద్యం భయాలతో గ్లోబల్ ఇన్వెస్టర్లు సురక్షిత సాధనాలైన యూఎస్ డెట్, జపనీస్ యెన్, స్విస్ ఫ్రాంక్ వైపు పరుగులు తీస్తున్నారు.
కరెన్సీ మార్కెట్లో భారత రూపాయి నిలకడగా రాణిస్తుండగా, అంతర్జాతీయ ముడి చమురు ధరలు వారాంతంలో తీవ్ర క్షీణతను సూచిస్తున్నాయి.
దేశీయ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FII) గత ఐదు సెషన్లుగా కొనుగోళ్లు కొనసాగిస్తూ, 2021 ఫిబ్రవరి తర్వాత అత్యధిక క్యాష్ బయ్యర్లుగా నిలిచారు.
నిఫ్టీ ఆర్‌ఎస్‌ఐ గత రెండేళ్ల గరిష్ఠ స్థాయి అయిన 75 పాయింట్లకు చేరడంతో టెక్నికల్ పాజ్ వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.





