అమరావతి: అర్నబ్ తుఫాను సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష

క్షేత్రస్థాయి పర్యటన అనంతరం సీఎస్, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్షించిన చంద్రబాబు
రాత్రి 8 గంటల వరకు క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించిన అధికారులు
విద్యుత్ పునరుద్ధరణ పనులు మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
అవసరమైతే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అదనపు విద్యుత్ సిబ్బందిని తీసుకురావాలని సూచన
ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు విశ్రమించొద్దని అధికారులకు సీఎం ఆదేశం
చివరి వ్యక్తికి సాయం అందేవరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలి.. అధికారుల కృషిని అభినందించిన చంద్రబాబు
మొబైల్ నెట్‌వర్క్ పునరుద్ధరణలో ఆశించిన వేగం కనిపించడం లేదు.. టెలికాం సంస్థల పనితీరుపై సీఎం అసంతృప్తి
కార్పొరేట్ కంపెనీలు మరింత బాధ్యతతో, వేగంగా పనిచేయాలని టెలికాం సంస్థలకు సూచన
విద్యుత్, రహదారులు, టెలికాం సేవల పునరుద్ధరణతో పాటు వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టంపై సమీక్ష
జలవనరులకు జరిగిన నష్టం, రిజర్వాయర్లు, చెరువుల్లో చేరుతున్న నీటిపై అధికారులతో చర్చించిన సీఎం
అక్టోబర్ 26 నుంచి 29 వరకు వర్షాలతో రాష్ట్రానికి 380 టీఎంసీల నీరు వచ్చినట్లు అంచనా
రిజర్వాయర్లలో అదనంగా 4.68 టీఎంసీల నీరు.. మరో 5 నుంచి 6 టీఎంసీలు చేరే అవకాశం
చిన్న నీటిపారుదల చెరువుల్లోకి 22 టీఎంసీల నీరు.. మరో 8 నుంచి 12 టీఎంసీలు చేరే అవకాశం
వర్షాలతో 44 టీఎంసీల మేర పెరిగిన భూగర్భ జలాలు
రాబోయే ఐదు రోజుల్లో గొట్టా బ్యారేజీకి 16.24 టీఎంసీలు, మడ్డువలసకు 12.01 టీఎంసీల ప్రవాహం వచ్చే అవకాశం
ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో 5,400 ప్రభావిత గ్రామాలు.. 4,771 గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
ఈపీడీసీఎల్ పరిధిలో ఇంకా 629 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరించాల్సి ఉంది
కృష్ణా జిల్లాలో 915 ప్రభావిత గ్రామాలు.. 835 గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
కృష్ణా జిల్లాలో మరో 80 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించాల్సి ఉంది
రాష్ట్రంలో 2,396 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న ప్రధాన జిల్లా, రాష్ట్ర రహదారులు
పశ్చిమ గోదావరిలో అత్యధికంగా 552 కి.మీ. మేర దెబ్బతిన్న రహదారులు
కోనసీమలో 396 కి.మీ., తూర్పుగోదావరిలో 372 కి.మీ. మేర రహదారులకు నష్టం
శ్రీకాకుళంలో 309 కి.మీ., అనకాపల్లిలో 236 కి.మీ., విజయనగరంలో 211 కి.మీ. మేర దెబ్బతిన్న రహదారులు
రహదారులపై ఏర్పడిన 62 కోతల్లో 22 పునరుద్ధరణ.. మరో 40 కోతలు పూడ్చాల్సి ఉంది
రహదారులపై ఏర్పడిన 34 గండ్లలో 13 పునరుద్ధరణ.. మరో 21 గండ్లు పూడ్చాల్సి ఉంది
దెబ్బతిన్న 102 కల్వర్టులు, ఇతర క్రాస్ డ్రైనేజీ నిర్మాణాల్లో 83 పునరుద్ధరణ
మరో 19 కల్వర్టులు, క్రాస్ డ్రైనేజీ నిర్మాణాల పునరుద్ధరణ పనులు పెండింగ్
రహదారులపై కూలిన 2,264 చెట్ల తొలగింపు పూర్తి
సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్యే 183 చెట్ల తొలగింపు
కాకినాడలో 127, తూర్పుగోదావరిలో 56 చెట్లను తొలగించిన సిబ్బంది
రాకపోకలకు అంతరాయం ఏర్పడిన 133 ప్రాంతాలు.. 99 చోట్ల రవాణా పునరుద్ధరణ





