ఫ్లోరిడాలో ఐఫోన్ల కోసం వెళ్తే కిడ్నాప్.. పొదల్లో డబ్బులు విసిరి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు!

ఫ్లోరిడాలోని డోరల్లో షాకింగ్ ఘటన జరిగింది.
అక్టోబర్ 9న ఫేస్బుక్ మార్కెట్ప్లేస్లో గతంలో డీల్ చేసిన సెల్లర్ వద్ద మరిన్ని ఐఫోన్లు కొనేందుకు వెళ్లిన వ్యక్తిని తెల్లటి BMW కారులో గన్తో బెదిరించి కిడ్నాప్ చేశారు.
31 ఏళ్ల డ్రైవర్ Lazaro Nunez-Martinez కారు నడుపుతుండగా, తుపాకీతో ఉన్న Darian Ernesto Morejon Rodriguez బాధితుడిని బెదిరించాడు.
బాధితుడు కదులుతున్న కారు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, అతడిని మళ్లీ లోపలికి లాగి గొంతు నులిమారని పోలీసులు తెలిపారు.
కారు వేగం తగ్గగానే బాధితుడు తన వద్ద ఉన్న $4,000 నగదు బ్యాగ్ను బయట పొదల్లోకి విసిరేశాడు.
డబ్బు కోసం నిందితుడు కిందకు దిగగానే.. బాధితుడు కారు నుంచి బయటకు దూకాడు. తప్పించుకునే క్రమంలో బ్యాగ్ పట్టీ అతడి మెడకు చుట్టుకున్నప్పటికీ, దానిని విడిపించుకుని పారిపోయాడు.
నిందితులు వెంటపడతారేమోనన్న భయంతో సమీపంలోని ఓ వ్యాపార సముదాయం వద్ద పొదల్లో దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నాడు.
నిందితులైన Lazaro Nunez-Martinez (31), Darian Ernesto Morejon Rodriguezలను అక్టోబర్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు.





