ఏపీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. నోటిఫికేషన్ విడుదల

అమరావతి.. ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కీలక ముందడుగు పడింది.
2026 పట్టణ స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ రిజర్వేషన్ల నోటిఫికేషన్ జారీ చేసింది.
106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలతో పాటు జనరల్ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 3,884 వార్డుల్లో బీసీలకు 1,273 స్థానాలు (32.78 శాతం) కేటాయించారు.
106 మున్సిపల్ చైర్‌పర్సన్ పదవుల్లో బీసీలకు 35 స్థానాలు (33.02 శాతం) దక్కాయి.
రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవుల్లో బీసీలకు 6 స్థానాలు (35.29 శాతం) కేటాయించారు.
గ్రామ పంచాయతీల్లోని 1,33,910 వార్డు సభ్యుల స్థానాల్లో బీసీలకు 30,315, మొత్తం 13,351 సర్పంచ్ పదవుల్లో 3,128 స్థానాలు ఖరారయ్యాయి.
9,913 ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 2,400, 661 ఎంపీపీ పదవుల్లో 152 స్థానాలు దక్కాయి.
మరోవైపు 661 జడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు 152, 28 జడ్పీ చైర్‌పర్సన్ పదవుల్లో 7 స్థానాలు కేటాయించారు.





