ఢిల్లీ లో చంద్రబాబు బిజీ బిజీ

బిల్డ్ ఏపీ మా ప్రభుత్వ నినాదం
ఎంవోయూలను పెట్టుబడులుగా మలిచేలా కార్యాచరణ
త్వరలోనే పారిశ్రామిక ప్రోత్సాహకాల ఎస్క్రో ఖాతా
ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని మరువలేం
సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
భారత అభివృద్ధి ప్రయాణంలో ఏపీది కీలక పాత్ర అన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పనకు దేశంలోనే అత్యుత్తమ గమ్య స్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో బిల్డ్ ఏపీ నినాదంతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, కేంద్రం అందిస్తున్న సహకారం, వివిధ రంగాల్లో చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణను పారిశ్రామికవేత్తలకు వివరించారు. గత ఏడాది నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.13.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని చంద్రబాబు తెలిపారు. గడచిన 28 నెలల్లో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించగలిగామని చెప్పారు. కేవలం ఎంవోయూలకే పరిమితం కాకుండా వాటిని వాస్తవ పెట్టుబడులుగా మలిచేలా ప్రత్యేకంగా దృష్టి సారించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గూగుల్ 1 గిగావాట్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిత్తల్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీకి వస్తున్నాయని తెలిపారు. గతంలో ప్రకటించినట్టుగా పారిశ్రామిక ప్రోత్సాహకాల ఎస్క్రో ఖాతా ఈ ఏడాది నవంబరు 12, 13 తేదీల్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న నాలా చట్టాన్ని రద్దు చేశామని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే ఏ విధానాన్నైనా తక్షణమే అమలు చేయడానికి ఏపీ సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేలా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
నీటి వనరులు... గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి
గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, కావేరి నదులను అనుసంధానిస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీటి కొరత ఉండదని చంద్రబాబు అన్నారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సౌత్‌ఈస్ట్ ఏషియాకు గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చడమే తమ లక్ష్యమన్నారు. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో ఇప్పటికే 110 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కారిడార్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు మజగావ్ డాక్‌యార్డ్ లిమిటెడ్ ముందుకు వచ్చిందని, మచిలీపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటుకు గోవా షిప్‌యార్డ్ సంస్థ అంగీకరించిందని వెల్లడించారు. తిరుపతి, లేపాక్షి, కొప్పర్తిలో డ్రోన్,





