భారత్‌లోని ప్రతి జిల్లాకు 5G కనెక్టివిటీ చేరింది: ప్రధాని మోదీ

భారత్ లో 5.5 లక్షలకు పైగా బేస్ స్టేషన్ల ద్వారా 5G సేవలు అందుతున్నాయి
2022తో పోలిస్తే భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ వేగం 10 రెట్లు పెరిగింది
టెలికాం రంగంలో భారత్ ప్రగతికి ఇండియా మొబైల్ కాంగ్రెస్ కీలక వేదికగా మారింది
స్కేల్ వితౌట్ బౌండరీస్’ లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతోంది
మొబైల్ ఫోన్ కేవలం కమ్యూనికేషన్ సాధనం కాదు.. గుడ్ గవర్నెన్స్‌కు కీలక సాధనంగా మారింది
డిజిటల్ ఇండియా ద్వారా డిజిటల్ డివైడ్‌ను తగ్గించాం
మొబైల్, ఇంటర్నెట్ కనెక్టివిటీతో విద్య, వైద్యం, చెల్లింపులు, ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి
కోవిడ్ సమయంలోనూ భారత్‌లో ఆఫీసులు, బ్యాంకులు, విద్యా కార్యకలాపాలు కొనసాగడానికి డిజిటల్ ఎకోసిస్టమే కారణం
దీక్షా ప్లాట్‌ఫామ్‌లో కోవిడ్ సమయంలో 500 కోట్లకు పైగా లెర్నింగ్ సెషన్లు నమోదయ్యాయి
సుమారు 25 కోట్ల మంది విద్యార్థులను డిజిటల్ విద్యా వేదికలకు అనుసంధానించడమే లక్ష్యం
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రూ.50 లక్షల కోట్లకు పైగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు చేరాయి
డీబీటీతో సుమారు రూ.5 లక్షల కోట్ల నిధులు లీకేజీకి గురికాకుండా కాపాడాం
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.4 లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశాము
మొబైల్ ఫోన్‌తో తక్కువ ప్రయాణం, తక్కువ నిరీక్షణ, తక్కువ ఖర్చు, ఎక్కువ సౌకర్యం లభిస్తున్నాయి
భారత్‌లో 50 కోట్లకు పైగా ప్రజలు గేమింగ్ ఎకోసిస్టంతో అనుసంధానమై ఉన్నారు
మొబైల్ ఫోన్ ఇప్పుడు గేమింగ్ కన్సోల్‌తో పాటు కంటెంట్ క్రియేషన్ స్టూడియోగా మారింది
చౌకైన డేటా, వేగవంతమైన కనెక్టివిటీతో గ్రామాలు, చిన్న పట్టణాలకు సోషల్ మీడియా, ఓటీటీ విస్తరణ
మొబైల్ ఫోన్ వల్ల భారత్‌లో కంటెంట్ క్రియేషన్ ప్రజాస్వామ్యీకరణ జరిగింది
ఫోన్, నెట్‌వర్క్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత
సైబర్ మోసాలు, సైబర్ నేరాలకు సరిహద్దులు లేవు.. ప్రపంచవ్యాప్త పరిష్కారం అవసరం
డీప్‌ఫేక్‌లు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారాయి
సైబర్ మోసాలను అరికట్టేందుకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటుr చేయాలని GSMA, టెలికాం ఆపరేటర్లకు సూచిస్తున్నాము
భారత్ కన్స్యూమర్ నుంచి క్రియేటర్‌గా మారింది.. ఇక భారత్‌లోనే ప్రొడక్ట్, డిజైన్, టెక్నాలజీ, ఐపీ అభివృద్ధి లక్ష్యం
టెలికమ్యూనికేషన్స్ చట్టంతో ఆధునిక నియంత్రణ వ్యవస్థ తీసుకొచ్చాము
AGR, బ్యాంక్ గ్యారంటీల వంటి నిర్మాణాత్మక భారాలను తగ్గించే చర్యలు చేపడుతున్నాము
గతిశక్తి సంచార్ పోర్టల్‌తో Right of Way అనుమతుల ప్రక్రియ వేగవంతం
భారత్‌లో సెమీకండక్టర్ తయారీ ఎకోసిస్టమ్ వేగం పుంజుకుంది
ఐదు ప్రాంతాల్లో వాణిజ్య సెమీకండక్టర్ ఉత్పత్తి ప్రారంభమైంది
ఇండియా సెమీకండక్టర్ మిషన్ తదుపరి దశలో మొత్తం సరఫరా గొలుసుపై దృష్టి పెడతాము
IMCను టెక్నాలజీ, పరిశోధన, పరిశ్రమ, పెట్టుబడులు, ఆలోచనలకు జంక్షన్‌గా మార్చాలి
భారత్ నుంచి ప్రపంచానికి చేరే ఉత్పత్తులు, ఆవిష్కరణలకు IMC వేదిక కావాలి
అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనకు టెలికాం, టెక్నాలజీ రంగాల





