తెలుగు ఎడిషన్ · 23 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
స్పేస్‌ఎక్స్ మాజీ ఉద్యోగికి తప్పుడు పన్ను నోటీసు.. డోర్‌డాష్ వివాదంబిస్లరీ వాటర్ సురక్షితం కాదన్న FSSAIతిరుమలకు శ్రీ కృష్ణదేవరాయలు ఇచ్చిన బంగారం ఎంత.. శాసనాల్లో అసలు లెక్కలివేమైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్.. 60 వేల మందికి అవకాశంసింగపూర్‌లో బాలిక దుర్వినియోగ కేసులో నౌవెల్ చువాకు 13 ఏళ్ల జైలు శిక్షవచ్చే ఎన్నికల్లో 90 సీట్లు, కోటి ఓట్ల లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డిట్రంప్, బైడెన్ హత్య కుట్ర కేసులో ఆసిఫ్ మర్చంట్‌కు 330 నెలల జైలు శిక్షఏలూరు ఆలయంలో అర్చకుడిపై దాడి.. షూస్ వేసుకుని వచ్చిన కమిటీ సభ్యుడిపై ఆరోపణలుస్పేస్‌ఎక్స్ మాజీ ఉద్యోగికి తప్పుడు పన్ను నోటీసు.. డోర్‌డాష్ వివాదంబిస్లరీ వాటర్ సురక్షితం కాదన్న FSSAIతిరుమలకు శ్రీ కృష్ణదేవరాయలు ఇచ్చిన బంగారం ఎంత.. శాసనాల్లో అసలు లెక్కలివేమైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్.. 60 వేల మందికి అవకాశంసింగపూర్‌లో బాలిక దుర్వినియోగ కేసులో నౌవెల్ చువాకు 13 ఏళ్ల జైలు శిక్షవచ్చే ఎన్నికల్లో 90 సీట్లు, కోటి ఓట్ల లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డిట్రంప్, బైడెన్ హత్య కుట్ర కేసులో ఆసిఫ్ మర్చంట్‌కు 330 నెలల జైలు శిక్షఏలూరు ఆలయంలో అర్చకుడిపై దాడి.. షూస్ వేసుకుని వచ్చిన కమిటీ సభ్యుడిపై ఆరోపణలు
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్‌లో తగ్గుతున్న చలి తీవ్రత.. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు

ప్రత్యేక కథనంజాతీయం
హైదరాబాద్‌లో తగ్గుతున్న చలి తీవ్రత.. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో ఈ ఏడాది వర్షాకాలం అంతంతమాత్రంగానే ఉండగా.. రానున్న చలికాలంలోనూ చలి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. ఈ శీతాకాలంలో నగరంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. దీంతో ఈసారి హైదరాబాద్‌ వాసులకు ‘చలి లేని శీతాకాలం’ ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు కొనసాగిన నైరుతి రుతుపవనాల సీజన్‌లో హైదరాబాద్‌లో మొత్తం 458.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో నగరంలో 627.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి దాదాపు 169 మిల్లీమీటర్ల మేర లోటు ఏర్పడింది.

IMD తాజాగా విడుదల చేసిన ‘సీజనల్ ఔట్‌లుక్‌’ ప్రకారం.. అక్టోబర్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలు ఇందుకు మినహాయింపుగా ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలకు ప్రధాన కారణాల్లో ఎల్‌నినో ప్రభావం ఒకటిగా వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్‌ సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే వేడెక్కే వాతావరణ పరిస్థితినే ఎల్‌నినో అంటారు.

ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తీవ్ర వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ రానున్న శీతాకాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేస్తోంది. సాధారణంగా అక్టోబర్‌ నెలలో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. అయితే ప్రస్తుతం మాత్రం ఎండ తీవ్రత కొనసాగుతోంది. నిన్న నగరంలో అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గా సైదాబాద్‌లో నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి తగ్గడం లేదు. నిన్న నగరంలో అత్యధిక కనిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌గా బహదూర్‌పురాలో నమోదైంది.

ఎల్‌నినో పరిస్థితులు కొనసాగితే రానున్న శీతాకాలంలోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది హైదరాబాద్‌లో చలి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు