☀️ సూర్యుడి శక్తితో సాగు.. తెలంగాణలో సోలార్ పంప్‌సెట్ల ఏర్పాటుకు వేగం!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
⠀
🌾 ఫేజ్–1లో 16,078 పంప్‌సెట్ల లక్ష్యం.. ఖమ్మంలో పనులను పరిశీలించిన అధికారులు
⠀
తెలంగాణలో వ్యవసాయ పంప్‌సెట్లకు సౌరశక్తిని అందించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఫేజ్–1లో రాష్ట్రానికి కేటాయించిన 16,078 సోలార్ పంప్‌సెట్ల ఇన్‌స్టాలేషన్‌ను వేగవంతం చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించారు.
⠀
ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో 7.5 కిలోవాట్ల సోలార్ వ్యవస్థ ఏర్పాటు పనులను జిల్లా కలెక్టర్, TGREDCO అధికారులు, జిల్లా మేనేజర్ పోలిశెట్టి అజయ్‌కుమార్ పరిశీలించారు. పనుల పురోగతి, సాంకేతిక ప్రమాణాలు, నాణ్యతపై దృష్టి పెట్టారు.
Full Story: https://t.co/k0yOBga0u7





