భారత్‌లో స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణ!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
⠀
భారత ప్రజలపై తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకే కొందరు శక్తిమంతమైన వ్యాపారవేత్తలు స్టార్‌లింక్ సేవలను అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఆరోపించారు.
అక్టోబర్ 7న ఎక్స్‌లో స్పందించిన మస్క్.. ఇది భారత ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యగా అభివర్ణించారు. అయితే ఏ వ్యక్తి లేదా కంపెనీ పేరునూ పేర్కొనలేదు.
స్టార్‌లింక్ పరిస్థితి ఏంటి?
భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ చెబుతోంది. వాణిజ్య సేవల ప్రారంభానికి అవసరమైన తుది భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.





