బిస్లెరీ నీరు తాగడానికి పూర్తి సురక్షితం: కంపెనీ ప్రకటన

బిస్లెరీ నీరు తాగడానికి పూర్తి సురక్షితమని కంపెనీ ప్రకటించింది. FSSAI నోటీసు వార్తలపై బిస్లెరీ యాజమాన్యం స్పందించింది. గోవా ప్లాంట్ శాంపిల్స్ వివాదం 14 నెలల నాటి పాత అంశమని బిస్లెరీ పేర్కొంది.
ఆరు శాంపిల్స్‌లో ఐదు అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఆరో శాంపిల్‌లో బ్రోమేట్ పరిమితిపై అప్పీల్ చేయగా రిఫరల్ ల్యాబ్‌లో క్లీన్ చిట్ లభించిందని స్పష్టం చేసింది.
స్వతంత్ర ల్యాబ్ పరీక్షల్లోనూ బిస్లెరీ నీరు సురక్షితమని తేలిందని సంస్థ వివరించింది. ఫిబ్రవరి 2026లోనే FSSAIకి పూర్తి నివేదికలు సమర్పించామని బిస్లెరీ తెలిపింది.
తమకు ఎలాంటి నోటీసులు అందలేదని, వెబ్‌సైట్‌లోనూ లేవని కంపెనీ వెల్లడించింది. 10 దశల్లో 90కి పైగా నాణ్యత పరీక్షల తర్వాతే నీటిని విక్రయిస్తామని బిస్లెరీ స్పష్టం చేసింది. వినియోగదారుల ఆరోగ్య భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని బిస్లెరీ పునరుద్ఘాటించింది.





