కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

రూ.77,101 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
ఢిల్లీలో యుగే యుగీన్ భారత్ మ్యూజియం ఏర్పాటుకు రూ.3,230 కోట్లు కేటాయింపు
నోయిడా – గ్రేటర్ నోయిడా మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు రూ.2,390 కోట్లు కేటాయింపు
రబీ 2026-27 సీజన్‌కు ఎరువుల సబ్సిడీ కోసం రూ.62,370 కోట్లు కేటాయింపు
సూక్ష్మ పరిశ్రమలకు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ కోసం రూ.5,000 కోట్లు కేటాయించిన కేంద్రం
స్టాండ్ అప్ ఇండియా పథకం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ కోసం రూ.4,111 కోట్లు కేటాయింపు
నోయిడా – గ్రేటర్ నోయిడా మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
నోయిడా సెక్టార్-51 నుంచి గ్రేటర్ నోయిడా సెక్టార్-04 వరకు ఆక్వా లైన్ మెట్రో విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం.
మొత్తం 8.449 కిలోమీటర్ల మేర జరగనున్న కొత్త మెట్రో కారిడార్ నిర్మాణం.
ఈ మార్గంలో 5 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్ల ఏర్పాటు.
నూతన విస్తరణతో నోయిడా, గ్రేటర్ నోయిడాలో మొత్తం 71.878 కిలోమీటర్లకు చేరుకోనున్న మెట్రో నెట్‌వర్క్
నోయిడా సెక్టార్-61 వద్ద బ్లూ లైన్ మెట్రోతో ఇంటర్‌చేంజ్ కనెక్టివిటీ.
గౌర్ సిటీ, గౌర్ సిటీ మాల్స్, బ్లూ సఫైర్ మాల్, IKEA వంటి వాణిజ్య ప్రాంతాలకు మెరుగుపడనున్న మెట్రో కనెక్టివిటీ
ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రధాన నివాస ప్రాంతాలకు పెరగనున్న రవాణా సౌకర్యం .
రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ఆదా కానున్న ప్రయాణ సమయం
కాలుష్యం, కార్బన్ ఉద్గారాలు తగ్గించేందుకు దోహదపడనున్న మెట్రో లైన్
వాణిజ్య కార్యకలాపాలు, పెట్టుబడులు, స్థానికంగా ఉపాధి అవకాశాలకు ప్రోత్సాహం అందించనున్న మెట్రో లైన్





