అసోంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఇంజిన్, ఐదు బోగీలు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అసోంలోని కామరూప్ మెట్రో జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. కోల్‌కతా–సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ (13125) రైలు బుధవారం ఉదయం 6:54 గంటల సమయంలో దిగారు రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పినట్లు ప్రాథమిక సమాచారం. రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయని, ప్రమాదం అనంతరం ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారని సమాచారం.
మరో రైలుకు మార్గం ఇచ్చే క్రమంలో లోకో పైలట్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రత్యామ్నాయ రైలు ద్వారా వారిని గమ్యస్థానాలకు తరలించే ఏర్పాట్లు చేపట్టారు.





