🔥 చేవెళ్లలో పాత పట్వారీ కార్యాలయానికి మంటలు.. కీలక రికార్డులు బూడిద!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చేవెళ్ల ఎమ్మార్వో కార్యాలయం సమీపంలోని పాత పట్వారీ భవనంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. స్టోరేజ్‌గా ఉపయోగిస్తున్న భవనంలో ఉన్న పాత రికార్డులు, ఇతర సామగ్రి మంటల్లో కాలిపోయాయి.
ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పలు కేసుల రికార్డులు కూడా దగ్ధమైనట్లు సమాచారం. షాద్‌నగర్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
దీపావళి బాణాసంచా నిప్పురవ్వల వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని ఎమ్మార్వో కృష్ణయ్య అనుమానం వ్యక్తం చేశారు. అసలు కారణంపై అధికారులు పరిశీలిస్తున్నారు.





