🔥 “నేరానికి సినిమాలనే బలి చేయొద్దు”.. విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా ఘాటు స్పందన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాప్తాడు స్కూల్‌లో విద్యార్థినిపై జరిగిన చైన్‌సా దాడి తర్వాత, సినిమాల్లో హింసను చూపించడంపై వస్తున్న విమర్శలకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. ఆయన Animal వంటి సినిమాలను ఈ ఘటనతో ముడిపెట్టడాన్ని తప్పుబట్టారు.
“ఘోరమైన నేరం జరిగితే ముందుగా బాధితుల పట్ల సానుభూతి చూపాలి. అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోవాలి. సినిమాను సులభమైన కారణంగా చూపించడం సరికాదు” అని పేర్కొన్నారు.
తన సినిమాలను టార్గెట్ చేసేందుకు ఈ విషాదాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ, కొందరు నటులు, దర్శకులు, నిర్మాతలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“A tragedy deserves empathy, not opportunism. Learn the difference” అంటూ తన పోస్ట్‌ను ముగించారు.





