కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తీరుపై విమర్శలు.. TSRTC బస్సులో యువతితో అనుచిత ప్రవర్తన ఆరోపణలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రంగారెడ్డి జిల్లాలో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులతో మాట్లాడేందుకు TSRTC బస్సు ఎక్కిన 70 ఏళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి..
ఇబ్రహీంపట్నం నుంచి యంజాళ్ వెళ్లే బస్సులో అక్టోబర్ 6న జరిగిన ఘటన..
పథకం వల్ల ఏడాదికి రూ.45,000 ఆదా అవుతోందని చెప్పిన కాలేజీ విద్యార్థిని..
వనస్థలిపురం నుంచి వస్తున్నానని చెప్పిన యువతి చేతిని పట్టుకుని మాట్లాడిన ఎమ్మెల్యే..
చేతిని విడిపించుకునేందుకు యువతి ప్రయత్నించిన దృశ్యాలు వీడియోలో వైరల్..
ఎమ్మెల్యేకు కన్సెంట్ (సమ్మతి) పై ఎలాంటి అవగాహన లేనట్లు కనిపిస్తోందంటూ విమర్శించిన ప్లేబ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద.





