బంగారం ధరల పతనంతో గోల్డ్ లోన్లపై ఆర్బీఐ హెచ్చరిక

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బంగారం ధరలు భారీగా పడిపోవడంతో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను (NBFCs) ఆర్బీఐ అప్రమత్తం చేసింది.
గోల్డ్ లోన్లపై తనిఖీలు, పర్యవేక్షణను కఠినతరం చేస్తామని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఈ ఏడాది జనవరిలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.80 లక్షల గరిష్ట స్థాయికి చేరగా, ప్రస్తుతం అది రూ.1.25 లక్షలకు పడిపోయింది.
బంగారం విలువ 30 శాతానికి పైగా తగ్గడంతో రుణ సంస్థల దగ్గర తాకట్టు విలువ తగ్గి, లోన్-టు-వాల్యూ నిష్పత్తి పెరుగుతోంది.
దీంతో సామాన్యులకు కొత్త బంగారు రుణాలు తీసుకోవడం, పాత రుణాలు రెన్యువల్ చేసుకోవడం కష్టంగా మారే అవకాశం ఉంది.





