తెలుగు ఎడిషన్ · 11 నవంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్!తెలంగాణలో చలి పంజా.. మరో మూడు రోజులు గజగజ.. 12 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!Click Post #2979బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం రిటైల్ కేంద్రాలు ఏర్పాటు చేసిందిదీపావళి వేడుకల్లో దేశీ బాణసంచా ప్రదర్శనAP తెలంగాణ న్యూస్ రౌండప్చికాగోలో గ్వాటెమాల వాణిజ్య బృందం.. 20 కంపెనీలతో ట్రేడ్ షోలూసియానాలో పిల్లలను వదిలేసిన మహిళకు జీవిత ఖైదురూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్!తెలంగాణలో చలి పంజా.. మరో మూడు రోజులు గజగజ.. 12 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!Click Post #2979బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం రిటైల్ కేంద్రాలు ఏర్పాటు చేసిందిదీపావళి వేడుకల్లో దేశీ బాణసంచా ప్రదర్శనAP తెలంగాణ న్యూస్ రౌండప్చికాగోలో గ్వాటెమాల వాణిజ్య బృందం.. 20 కంపెనీలతో ట్రేడ్ షోలూసియానాలో పిల్లలను వదిలేసిన మహిళకు జీవిత ఖైదు
వాతావరణం
📅 తేదీ వారీగా

బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం రిటైల్ కేంద్రాలు ఏర్పాటు చేసింది

ప్రత్యేక కథనంజాతీయం
బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం రిటైల్ కేంద్రాలు ఏర్పాటు చేసింది
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

Bulk: బియ్యం ధరల నియంత్రణకు కేంద్రాల ఏర్పాటు బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిర్యాలగూడ రైస్ మిల్లుల్లో ప్రత్యేకంగా రిటైల్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇక్కడ బియ్యం విక్రయాలు సాగుతున్నాయి.

కేఎఫ్‌సీ లైసెన్స్ రద్దు హోటళ్లలో అపరిశుభ్రతతో భోజనం చేయాలంటేనే జనం భయపడుతున్నారు. వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కేఎఫ్‌సీ లైసెన్స్‌ను అధికారులు రద్దు చేశారు.

సింహాచలం భక్తులకు డ్రెస్ కోడ్ సింహాచలంలో సింహగిరిపై భక్తులకు సంప్రదాయ దుస్తుల నియమావళిని తప్పనిసరి చేశారు. షార్ట్స్, టీ-షర్టులు, స్లీవ్‌లెస్ టాప్స్, మోడ్రన్ దుస్తులు ధరించి వస్తే ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. ఈ డ్రెస్ కోడ్ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయన్న దానిపై త్వరలో క్లారిటీ రానుంది.

టౌన్ ప్లానింగ్ అవినీతిపై ఏసీబీ నివేదిక ఏపీలో టౌన్ ప్లానింగ్ అవినీతిపై ఏసీబీ నివేదిక సిద్ధం చేసింది. అందులో కీలక అంశాలు ఏమున్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అక్రమాలపై ప్రభుత్వానికి ఏసీబీ ఏం నివేదించబోతోందన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

తమ్మిడికుంట చెరువుకు కొత్త కళ మాధాపూర్‌లోని తమ్మిడికుంట చెరువుకు కొత్త కళ వచ్చింది. హైడ్రా ఆధ్వర్యంలో 20 కోట్ల రూపాయలతో ఈ చెరువును పునరుద్ధరించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో పాటు ల్యాండ్ స్కేపింగ్ పనులను అందంగా తీర్చిదిద్దారు.

జేఎన్టీయూలో జల సంరక్షణ జేఎన్టీయూ వర్సిటీలో వినూత్న రీతిలో జల సంరక్షణ చేపడుతున్నారు. ప్రత్యేక ఏర్పాట్లతో కోట్ల లీటర్ల వర్షపు నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ ప్రయోగం వర్షపు నీటి సంరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

ధాన్యం కొనుగోలులో రైతుల ఇబ్బందులు ధాన్యం కొనుగోలులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిల్లర్ల మాయాజాలం, వ్యాపారుల దందాతో నష్టపోతున్నారు. దసరాకు ముందు రికార్డు ధర పెట్టి కొన్న వ్యాపారులు.. ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.

అక్రమ అండాల కేసులో ముమ్మర దర్యాప్తు అక్రమ అండాల సేకరణ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ దందా వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రదారుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

అండాల దందాపై ఉక్కుపాదం అండాల సేకరణ అక్రమ దందాపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలు ఉల్లంఘించిన 7 ఏఆర్టీ కేంద్రాలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో ఈ సెంటర్లలో అసలేం జరుగుతోందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

తిరుపతి డిప్యూటీ మేయర్ కోసం సిగపట్లు తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి నేతల మధ్య సిగపట్లు సాగుతున్నాయి. జనసేన, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పదవి దక్కించుకునేందుకు ఎవరికి వారే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. S

సంబంధిత వార్తలు