అమరావతి: విజయవాడలో జాతీయ సారస్ మేళా

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేడు సారస్ మేళా ప్రారంభం
దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదిక
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఏపీ సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో సారస్ మేళా
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొననున్న మహిళా పారిశ్రామికవేత్తలు, హస్తకళాకారులు
సారస్ మేళా కోసం సుమారు 630 స్టాళ్ల కేటాయింపు
గ్రామీణ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత ప్రచారం, విక్రయాలకు అవకాశం
చేనేత వస్త్రాలు, హస్తకళలు, సంప్రదాయ కళాకృతులు, గృహోపకరణాల ప్రదర్శన
వివిధ రాష్ట్రాల ప్రత్యేక ఆహార పదార్థాలు, మసాలా దినుసులు, గ్రామీణ ఉత్పత్తులకు ప్రత్యేక ఆకర్షణ
మహిళా స్వయం సహాయక సంఘాలకు నేరుగా వినియోగదారులతో వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకునే అవకాశం
మధ్యవర్తుల ప్రమేయం తగ్గించి ఉత్పత్తిదారులకు మెరుగైన ఆదాయం అందించడమే లక్ష్యం
ఉత్పత్తుల నాణ్యత, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్పై అవగాహన కల్పించే కార్యక్రమాలు
దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళల నైపుణ్యాలు, వ్యాపార సామర్థ్యాలను చాటిచెప్పనున్న సారస్ మేళా
గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన, స్థిరమైన జీవనోపాధులకు ప్రోత్సాహం





