హై కోర్ట్

రేడియల్ రోడ్ టెండర్ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన సుశీ ఇన్‌ఫ్రా
సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ పిటిషన్ దాఖలు
రేడియల్ రోడ్-2 టెక్నికల్ బిడ్ తిరస్కరణపై అభ్యంతరం తెలుపుతూ పిటిషన్
టెక్నికల్ బిడ్‌ను అనర్హతగా ప్రకటించడాన్ని సవాల్ చేసిన సంస్థ
అనుభవ ధ్రువీకరణ పత్రంపై అభ్యంతరంతో బిడ్ తిరస్కరించిన అధికారులు
టెండర్ నిబంధనలకు విరుద్ధంగా బిడ్ తిరస్కరించారంటున్న పిటిషనర్
అధికారుల చర్య చట్టవిరుద్ధమంటూ పిటిషనర్ వాదన
టెక్నికల్ బిడ్ మూల్యాంకన ఫలితాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి
తమ సంస్థను సాంకేతికంగా అర్హత కలిగినదిగా ప్రకటించాలని కోరిన సుశీ ఇన్‌ఫ్రా
ఇతర అర్హత కలిగిన బిడ్డర్లతో పాటు తమ ప్రైస్ బిడ్ తెరవాలని అభ్యర్థన
ORR కొత్వాల్‌గూడ నుంచి బుద్వేల్ మీదుగా NH-167N వరకు రేడియల్ రోడ్-2, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయమూర్తి
స్టే ఇస్తే కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిలిచిపోతుందన్న కోర్టు
మధ్యంతర ఉత్తర్వులు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని వ్యాఖ్యనించిన హై కోర్టు
అనుభవ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటుపై తర్వాత విచారణ చేస్తామన్న హై కోర్టు
కౌంటర్లు దాఖలయ్యాకే అనుభవ సర్టిఫికెట్‌పై పరిశీలన
రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశం
L-1 బిడ్డర్‌ను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు ఆదేశం
ఈ నెల 8న తీసుకున్న నిర్ణయం తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉండాలని హై కోర్టు స్పష్టీకరణ
మధ్యంతర పరిశీలనల ఆధారంగా ఎవరూ ఈక్విటీ క్లెయిమ్ చేయరాదన్న హై కోర్టు





