అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు సదస్సు.. స్టార్టప్‌లు, కెరీర్‌పై మార్గదర్శనం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల కోసం 26 సెప్టెంబర్ 2026న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
వెంకట్ సాయి కోల్లి, అను, రోహిత్ వక్తలుగా హాజరై ప్రసంగించారు.
ఓపీటీ (OPT)లో ఉన్నప్పుడు స్టార్టప్ ప్రారంభించడం, మొదటి నుంచి ప్రొడక్ట్ తయారు చేయడం, చేసిన తప్పులపై వెంకట్ సాయి కోల్లి మాట్లాడారు.
మొదలుపెట్టడానికి అన్నీ ముందే తెలిసి ఉండాల్సిన అవసరం లేదు.. నిర్మించడం, తప్పులు చేయడం, ఆ తప్పులు నేర్పే పాఠాలపై దృష్టి పెట్టడం ద్వారానే నేర్చుకుంటారని వెంకట్ సాయి స్పష్టం చేశారు.
ఉద్యోగం సాధించడం, జాబ్ వచ్చేలా రెజ్యూమ్ తయారు చేయడంపై అను ప్రసంగించారు.
అంతర్జాతీయ విద్యార్థులు డబ్బును ఎలా నిర్వహించుకోవాలో వ్యక్తిగత ఫైనాన్స్‌పై రోహిత్ వివరించారు.
సదస్సు చివరలో విద్యార్థుల ప్రశ్నలతో సెషన్ ముగిసింది.





