🚨 హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోతుందా? వైరల్ మెసేజ్‌ను నమ్మొద్దు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎల్‌నినో, కరువు కారణంగా నవంబరు చివరి నాటికి హైదరాబాద్‌కు నీరందించే జలాశయాలు ఎండిపోతాయని.. నీటి సరఫరాను పరిమితం చేస్తారని లేదా నిలిపివేస్తారని ప్రచారమవుతున్న సందేశం జలమండలి జారీ చేసినది కాదు.
ఆ సందేశంలోని జలాశయాల నీటిమట్టాలు, నీటి సరఫరాకు సంబంధించిన వాదనలు అధికారిక సమాచారం కావని హైదరాబాద్ జలమండలి (HMWSSB) స్పష్టం చేసింది.
⚠️ ఈ మెసేజ్‌ను నమ్మి ఆందోళన చెందవద్దు.. ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు. నీటి సరఫరా వివరాల కోసం జలమండలి అధికారిక ప్రకటనలనే అనుసరించండి.





