తిరుపతి: తుడా పరిధిలో జరగనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం.

అమరావతి నుంచి వర్చువల్‌గా పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
శ్రీవారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్, టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారానికి నివాస లేఅవుట్ అభివృద్ధి, 9 మాస్టర్ ప్లాన్ రోడ్లకు శంకుస్థాపన చేసిన సీఎం.
రూ 1,332 కోట్లతో భక్తుల కోసం వసతి సముదాయాల నిర్మాణం.
నాలుగు బ్లాకుల్లో 2,700 గదులు, రోజుకు 15 వేల మంది భక్తులకు వసతి కల్పన.
రూ 160 కోట్లతో అన్నప్రసాద కేంద్రం.
ఒకేసారి 6 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా రూపకల్పన.
రూ 486 కోట్లతో నాలుగు పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్‌ల నిర్మాణం.
పిలిగ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్స్‌లలో ఒకేసారి 16 వేల మంది భక్తులు విశ్రాంతి తీసుకునే సౌకర్యం.
రూ.311 కోట్లతో 4,500 వాహనాలు నిలిపేలా బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం నిర్మాణం.
రూ 90 కోట్లతో 30 బస్ బేలతో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం.
తిరుమలకు వచ్చే భక్తులకు వసతి, అన్నప్రసాదం, రవాణా, పార్కింగ్, వైద్య సేవలన్నీ ఒకేచోట అందుబాటులోకి తీసుకురానున్న టీటీడీ.
తిరుమల కొండపై రద్దీ తగ్గించేందుకు తిరుపతిలో వసతి సౌకర్యాల విస్తరణ.
భక్తుల కోసం పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, డిజిటల్ సమాచార కేంద్రం ఏర్పాటు.
టౌన్‌షిప్‌లో అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థ.
టీటీడీ ఉద్యోగుల నివాసాల లేఅవుట్ అభివృద్ధి.
418 ఎకరాల్లో రెండు దశల్లో 5,192 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇప్పటికే కేటాయింపు.
టీటీడీ ఉద్యోగుల నివాస లేఅవుట్‌లో మౌలిక వసతులకు రూ.230 కోట్ల ఖర్చు చేస్తున్న టీటీడీ.
ఉద్యోగుల లేఅవుట్‌లో అంతర్గత బీటీ రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయాల కల్పన.
తిరుపతిలో రూ.242 కోట్లతో 9 మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన.





