తిరుపతి: ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది

శ్రీవారి భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన కు శంకుస్థాపనలు చేశాం.
తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది
సౌకర్యాలు కల్పించినప్పుడు భక్తుల్లో మరింత భక్తిభావం పెరుగుతుంది.
ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ ద్వారా భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే ప్రాంతంలోకి రానున్నాయి
ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
రద్దీకి అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ ను అలిపిరిలో నిర్మిస్తున్నాం
రవాణా, అన్నప్రసాదం, వసతి మెుత్తం ఒకే ప్రాంతంలోకి రానుంది
భక్తులకు సేవచేస్తే భగవంతుడికి సేవచేసినట్లే.
అధికారులు కలిసికట్టుగా పనిచేయాలి.
అనుకున్న సమయంలోగా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ ను పూర్తి చేయండి
శ్రీవారి చరిత్ర, తిరుమల వైభవం తెలియజేసేలా టౌన్ షిప్ నిర్మాణం జరుగనుంది
టిటిడి ఉద్యోగస్తులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు.
418ఎకరాలు 5,192మంది ఉద్యోగస్తులకు ఇచ్చి ఆ స్థలంలో మౌలిక వసతులను కల్పిస్తున్నాం.
తిరుపతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం.
తుడా నిధులతో నూతన రోడ్లకు శ్రీకారం చుట్టాం.
రోడ్ల నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి
తిరుపతిలో చెరువులను అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం
కళ్యాణిడ్యాంకు హంద్రీనీవా జలాలు త్వరలో తీసుకొస్తాం
హంద్రీనీవా జలాలు త్వరలో తిరుపతి ప్రజలకు అందుతుంది
పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన నగరంగా తిరుపతిని తీర్చిదిద్దాలి
పవిత్రతలో ఎక్కడా రాజీపడకూడదు
అన్నప్రసాదం నుంచి శ్రీవారి ప్రసాదం వరకు అన్నింటిని ప్రక్షాళన చేశాం
దేవుడి దగ్గర మనం సేవకులం మాత్రమే
స్పిరిచ్యువాలిటీటెక్నాలజీని రెండింటిని ముందుకు తీసుకువెళ్లాలి.
సీఎం చంద్రబాబు





