తెలుగు ఎడిషన్ · 27 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
థాంక్స్ గివింగ్ తుఫాను.. 8.5 లక్షల ఇళ్లకు చీకట్లు, విమానాలు రద్దుమసాచుసెట్స్ లాటరీ విజేతకు షాక్.. ICE అరెస్ట్ఎన్విడియా చిప్‌ల లీజుపై CBS నివేదికవేటపాలెం మండల పందిళ్లపల్లి గ్రామంలో ఉద్రిక్తతగూగుల్ AI అనలిస్ట్ చార్లెస్ బ్రూమ్‌ఫీల్డ్ ఆర్థిక స్వాతంత్ర్యం లక్ష్యంఫెడరల్ ఏజెంట్లపై 1 మిలియన్ డాలర్ల దావా వేసిన డేయాన్ ఫిగ్యురోవాయూరోప్‌లో రష్యా విధ్వంసక దాడులు.. ఐఐఎస్ఎస్ హెచ్చరికహోబర్ట్‌లో బాలుడికి తీవ్ర గాయాలు.. స్మిత్‌పై ఆరోపణలుథాంక్స్ గివింగ్ తుఫాను.. 8.5 లక్షల ఇళ్లకు చీకట్లు, విమానాలు రద్దుమసాచుసెట్స్ లాటరీ విజేతకు షాక్.. ICE అరెస్ట్ఎన్విడియా చిప్‌ల లీజుపై CBS నివేదికవేటపాలెం మండల పందిళ్లపల్లి గ్రామంలో ఉద్రిక్తతగూగుల్ AI అనలిస్ట్ చార్లెస్ బ్రూమ్‌ఫీల్డ్ ఆర్థిక స్వాతంత్ర్యం లక్ష్యంఫెడరల్ ఏజెంట్లపై 1 మిలియన్ డాలర్ల దావా వేసిన డేయాన్ ఫిగ్యురోవాయూరోప్‌లో రష్యా విధ్వంసక దాడులు.. ఐఐఎస్ఎస్ హెచ్చరికహోబర్ట్‌లో బాలుడికి తీవ్ర గాయాలు.. స్మిత్‌పై ఆరోపణలు
వాతావరణం
📅 తేదీ వారీగా

తిరుపతిలో రూ.3,222 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రత్యేక కథనంజాతీయం
తిరుపతిలో రూ.3,222 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
Photo: Hemshah171095 / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమరావతి: తిరుపతి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి సచివాలయం నుంచి వర్చువల్‌గా పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి

భక్తులకు సమాచారం అందించేలా వెంకటాద్రి యాప్‌ను ఆవిష్కరించిన సీఎం

శ్రీవారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం

టీటీడీ ఉద్యోగుల నివాస లేఅవుట్ అభివృద్ధి, 9 మాస్టర్ ప్లాన్ రోడ్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన

అలిపిరి వద్ద రూ.1,332 కోట్లతో భక్తుల కోసం వసతి సముదాయాల నిర్మాణం

నాలుగు బ్లాకుల్లో 2,700 గదులు,రోజుకు 15 వేల మంది భక్తులకు వసతి కల్పన

160 కోట్లతో అన్నప్రసాద కేంద్రం, ఒకేసారి 6 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా రూపకల్పన.

486 కోట్లతో నాలుగు పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్‌ల నిర్మాణం

పిలిగ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్స్‌లలో ఒకేసారి 16 వేల మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా సౌకర్యాలు

311 కోట్లతో 4,500 వాహనాలు నిలిపే బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం నిర్మాణం

90 కోట్లతో 30 బస్ బేలతో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ నిర్మాణానికి శ్రీకారం

తిరుమలకు వచ్చే భక్తులకు వసతి, అన్నప్రసాదం, రవాణా, పార్కింగ్, వైద్య సేవలన్నీ ఒకేచోట ఏర్పాటు

తిరుమలపై రద్దీని తగ్గించేలా దిగువ తిరుపతిలో వసతి సౌకర్యాల విస్తరణ

భక్తుల కోసం పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, డిజిటల్ సమాచార కేంద్రం ఏర్పాటు

టౌన్‌షిప్‌లో అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థ

టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం దిశగా నివాస లేఅవుట్ అభివృద్ధి

418 ఎకరాల్లో 5,192 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు

టీటీడీ ఉద్యోగుల నివాస లేఅవుట్‌లో మౌలిక వసతులకు రూ.230 కోట్ల వ్యయం

ఉద్యోగుల లేఅవుట్‌లో అంతర్గత బీటీ రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయాలు

తిరుపతి నగరంలో రూ.242 కోట్లతో 9 మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి 3 మాస్టర్ ప్లాన్ రహదారులు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు