తెలుగు ఎడిషన్ · 13 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ప్రిన్సిపాల్‌కు వినూత్న బర్త్‌డే సర్ప్రైజ్.. గొడవ నటించి విషెస్అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు సదస్సు.. స్టార్టప్‌లు, కెరీర్‌పై మార్గదర్శనంపెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో రక్తపాతంరూపాయికి భారీ ఊరట.. డాలర్‌తో పోలిస్తే 1 శాతం జంప్ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్‌లో 430 చెట్ల నరికివేతపై ఫెడరల్ జడ్జి ఫైర్విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హల్‌చల్.. సిబ్బందిపై దాడితో అరెస్ట్ఫ్లోరిడాలో వరుస నేరాల కలకలం.. ఫెంటానిల్ ముఠాలు, కాల్పుల ఘటనలుఉద్యోగులకు ఏఐతో సరికొత్త బలం.. బర్డ్ సీఈఓ కీలక వ్యాఖ్యలుప్రిన్సిపాల్‌కు వినూత్న బర్త్‌డే సర్ప్రైజ్.. గొడవ నటించి విషెస్అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులకు సదస్సు.. స్టార్టప్‌లు, కెరీర్‌పై మార్గదర్శనంపెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో రక్తపాతంరూపాయికి భారీ ఊరట.. డాలర్‌తో పోలిస్తే 1 శాతం జంప్ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్‌లో 430 చెట్ల నరికివేతపై ఫెడరల్ జడ్జి ఫైర్విమానంలో నటి సెల్మా బ్లెయిర్ హల్‌చల్.. సిబ్బందిపై దాడితో అరెస్ట్ఫ్లోరిడాలో వరుస నేరాల కలకలం.. ఫెంటానిల్ ముఠాలు, కాల్పుల ఘటనలుఉద్యోగులకు ఏఐతో సరికొత్త బలం.. బర్డ్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
వాతావరణం
📅 తేదీ వారీగా

బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి అక్రమంగా బంగారం స్మగ్లింగ్

ప్రత్యేక కథనంజాతీయం
బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి అక్రమంగా బంగారం స్మగ్లింగ్
Photo: Arupparia / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

11.5 కోట్ల విలువైన 7.8 కిలోలకు పైగా విదేశీ బంగారం స్వాధీనం - ఆరుగురి అరెస్ట్

బంగారం అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేసిన DRI

బంగ్లాదేశ్ నుంచి సరిహద్దుల మీదుగా భారత్ తూర్పు ప్రాంతంలో సాగుతున్న బంగారం అక్రమ రవాణాపై రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) దాడులను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అక్టోబర్ 8, 9 తేదీల్లో తూర్పు ప్రాంతంలో కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా నిర్వహించిన దాడుల్లో 7.8 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ.11.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సరిహద్దు ప్రాంతాల నుంచి కోల్‌కతాకు అక్రమంగా రవాణా చేసిన బంగారాన్ని తరలించేందుకు రోడ్డు, రైల్వే మార్గాలను వినియోగిస్తున్నట్లు DRI ఆపరేషన్ల ద్వారా బయటపడింది...బంగారం అక్రమ రవాణా కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు.

బంగ్లాదేశ్ సరిహద్దుల మీదుగా భారత్ లోకి బంగారం స్మగ్లింగ్

బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని డాంకుని టోల్ ప్లాజా వద్ద అక్రమ బంగారం స్మగ్లింగ్ గురించి పక్కా సమాచారం తో బన్‌పూర్ నుంచి కోల్‌కతా వైపు వెళ్తున్న వాహనాన్ని అడ్డగించి తనిఖీలు నిర్వహించగా 6.8 కిలోల బరువున్న 50 బంగారు కడ్డీలు లభించాయి. వీటి విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. వీటిలో కొన్ని బంగారు బిస్కెట్లపై విదేశీ గుర్తులు ఉన్నాయి.వాహనంలో ఉన్న నలుగురు నిందితులను DRI అధికారులు అదుపులోకి తీసుకున్నారు..బంగారాన్ని చట్టబద్ధంగా తరలించడాన్ని నిరూపించే ఎలాంటి చెల్లుబాటు అయ్యే పత్రాలను నిందితులు సమర్పించలేదు. బంగ్లాదేశ్ మీదుగా విదేశీ మూలాలున్న బంగారాన్ని భారతదేశంలోకి అక్రమంగా తరలించడంలో తమ ప్రమేయం ఉందని నిందితులు వాంగ్మూలాల్లో అంగీకరించారు. ముఖ్యంగా, బన్‌పూర్ సరిహద్దు ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ అక్రమ రవాణా ముఠాకు ప్రధాన సూత్రధారి కూడా అరెస్టయిన నలుగురిలో ఉండటం గమనార్హం.

పశ్చిమ బెంగాల్ లో బంగారం స్మగ్లర్ల అరెస్ట్

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా టౌన్ రైల్వే స్టేషన్, న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్‌లలో డీఆర్ఐ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. రైళ్లలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను అడ్డగించి, వారి వద్ద నుంచి సుమారు కిలో విదేశీ మూలాలున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. దీని విలువ దాదాపు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. బంగారాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు నిరూపించే పత్రాలను సమర్పించడంలో ఇద్దరు నిందితులను అధికారులు అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం గాజులు, బంగారు కడ్డీల రూపంలో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. త్రిపురలో భారత్‌ - బంగ్లాదేశ్‌ సరిహద్దు మీదుగా అక్రమంగా తరలించిన బంగారంతో వీటిని తయారు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది...బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలతో పాటు, ఈశాన్య రాష్ట్రాలను కోల్‌కతా వంటి ప్రధాన మార్కెట్లతో అనుసంధానించే రహదారి, రైల్వే మార్గాలను కూడా అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని తరలించేందుకు స్మగ్లర్లు ఉపయోగిస్తున్నారు...ని

X లో చూడండి ›

సంబంధిత వార్తలు