దసరాకు సొంతూరి బాట పట్టారా? చౌటుప్పల్‌లో ట్రాఫిక్‌తో ఆలస్యం!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దసరా సెలవులతో సొంతూళ్లకు బయలుదేరిన జనంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (NH–65)పై భారీ రద్దీ ఏర్పడింది.
చౌటుప్పల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. లక్కారం నుంచి ధర్మోజీగూడెం వరకు వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ మార్గంలో వెళ్లేవారు ప్రయాణానికి అదనపు సమయం కేటాయించుకోండి. బయలుదేరే ముందు తాజా ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించి, పోలీసుల సూచనలకు అనుగుణంగా ప్రయాణం ప్లాన్ చేసుకోండి.





