గోవా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ ప్రతినిధిగా ఇవాళ నేను గోవాకు వచ్చా…
రాహుల్ గాంధీ గోవాకు రావాల్సి ఉన్నా.. ఢిల్లీలో నిరసన కార్యక్రమాల నేపథ్యంలో ఆయన రాలేకపోయారు
అందుకే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రతినిధిగా నన్ను ఇక్కడకు పంపించారు
జ్ఞానేష్ కుమార్ పేరుతో మోదీ పేదల ఓట్లను తొలగించాలని చూస్తున్నారు.
గోవా ప్రజలు బీజేపీతో విసిగిపోయారు…
మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే గోవా ప్రజలు పరాయి వారిగా మారిపోయె పరిస్థితి ఏర్పడుతుంది .
ఇక్కడి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి
గోవా సీఎం ప్రమోద్ సావంత్ కాదు.. ప్రాపర్టీ సావంత్ అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు
గోవా సీఎం… గోవాను అభివృద్ధి చేసే పనిలో కాకుండా ఇక్కడి ఆస్తులను ఇతరులకు అప్పగించే పనిలో ఉన్నారు
గోవా యువతను డ్రగ్స్ కు బానిసలుగా మార్చారు
బీజేపీ పాలనలో… గోవా డ్రగ్స్ సోర్స్ గా మారిపోయింది
నషా ముక్త్ భారత్ అని మాట్లాడుతున్న పీఎం, కేంద్ర హోంమంత్రి ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదు
గోవాను డ్రగ్స్ పెడ్లర్స్ అడ్డాగా మార్చారు
ఇది గోవాకు కీర్తిని తెచ్చి పెడుతుందా.. గోవా పేరును చెడగొడుతుందా?
గోవా యువత డ్రగ్స్ కు బానిసలు కావద్దు.. గోవా పేరు చెడిపోవద్దన్నదే మా ఆకాంక్ష
గోవాలో కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే చేరుతుంది
డ్రగ్స్ లార్డ్స్, ల్యాండ్ మాఫియా గోవాలో రాజ్యమేలాలా? మీరే ఆలోచన చేయండి
ఇది రావణ్, రాముడికి మధ్య జరుగుతున్న పోరాటం
రావణ్ అంటే బీజేపీ, రాముడు అంటే కాంగ్రెస్ పార్టీ…
రావణ్ ను ఓడించాలంటే మీరంతా రాముడికి మద్దతుగా నిలబడాలి
రెండుసార్లు గోవా ప్రజలు మోసపోయారు… మూడోసారి బీజేపీని నమ్మి మోసపోవద్దు
దేశాన్ని ఏకం చేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు
రాహుల్ గాంధీ దేశ ప్రజలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తుంటే… మోదీ విభజించడానికి ప్రయత్నిస్తున్నారు
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నైస్, ఐస్ బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా పనిచేస్తాయి…
ఇప్పుడు వాటితో కూడా బీజేపీకి ప్రయోజనం లేకుండా పోయింది
అందుకే ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ పేరుతో ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు
పేదలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీల ఓట్లు తొలగిస్తున్నారు
గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది..
ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాదు.. గోవా ప్రజల కోసం..
దేశంలో రుతుపవనాలు (మాన్ సూన్ )ముందుగా కేరళలో ప్రవేశిస్తుంది.. ఆ తరువాత గోవాలో ప్రవేశిస్తుంది
2026 మాన్ సూన్ లో కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది
ఇపుడు 2027 మాన్ సూన్ లో గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది
గోవా నుంచి నేరుగా ఢిల్లీ ఎర్ర కోటపై మూడు రంగుల జెండా ఎగరడం ఖాయం.





