తెలుగు ఎడిషన్ · 12 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన 6 వంతెనలు, 10 మంది గల్లంతుహైదరాబాద్:చార్మినార్ ప్రాంతంలో దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలికలను పోలీసులు వేధింపులుప్రకాశంవిశాఖ: మధురవాడ చంద్రంపాలెంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణదసరాకు సొంతూరి బాట పట్టారా? చౌటుప్పల్‌లో ట్రాఫిక్‌తో ఆలస్యం!సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై దాడి..తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్‌పై టీటీడీ సీరియస్.. సర్కార్‌కు నోటీసులుఅభిషేక్‌ మెరుపులు.. అర్ష్‌దీప్‌ కీలక వికెట్లు.. టీమిండియా గెలుపు!నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన 6 వంతెనలు, 10 మంది గల్లంతుహైదరాబాద్:చార్మినార్ ప్రాంతంలో దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలికలను పోలీసులు వేధింపులుప్రకాశంవిశాఖ: మధురవాడ చంద్రంపాలెంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణదసరాకు సొంతూరి బాట పట్టారా? చౌటుప్పల్‌లో ట్రాఫిక్‌తో ఆలస్యం!సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై దాడి..తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్‌పై టీటీడీ సీరియస్.. సర్కార్‌కు నోటీసులుఅభిషేక్‌ మెరుపులు.. అర్ష్‌దీప్‌ కీలక వికెట్లు.. టీమిండియా గెలుపు!
వాతావరణం
📅 తేదీ వారీగా

మునుగోడు లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు

ప్రత్యేక కథనంజాతీయం
మునుగోడు లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మునుగోడు నియోజకవర్గ నలుదిక్కుల నుండి వచ్చి ఆడి పాడిన ఆడపడుచులు

మునుగోడు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీ గారు

మునుగోడులో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆద్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరైన మునుగోడు శాసనసబ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక… ప్రకృతిని ఆరాధించే అపురూపమైన పండుగ… పూలను పూజించే మన సంస్కృతికి నిలువుటద్దం… మన తెలంగాణ పండుగ బతుకమ్మ.... గుమ్మడి పూలు, తంగేడు పూలు, గునుగు పూలు, బంతి పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల మధ్య, మహిళల ఆటపాటలతో, జానపద గీతాల నడుమ మునుగోడు గడ్డపై బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి..

మునుగోడు లోని క్యాంపు కార్యాలయం నుండి నియోజకవర్గ మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల ప్రాంగణానికి బతుకమ్మలతో చేరుకుని వేదమంత్రాలతో పూజలు చేసి 15 అడుగుల బతుకమ్మకు హారతిచ్చి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారితో కలిసి బతుకమ్మ వేడుకలను ప్రారంబించారు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీగారు...

బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ మాత్రమే కాదని, ఇది మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకని,మహిళల ఐక్యతకు, కుటుంబాల సంతోషానికి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపమైన ఈవేడుకలను అంగరంవైభవంగా నిర్వహించారు...ఈ బతుకమ్మ వేడుకలకు నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది మహిళలు తమ కుటుంబాలతో కలిసి తరలివచ్చారు...

నాటి పల్లె పాటల నుండి నేటి డీజే పాటల వరకు ప్రతి బతుకమ్మ పాటకు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు...ఈ బతుకమ్మ పండుగ మన మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, ప్రతి ఆడపడుచు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని,. రైతులు సుభిక్షంగా ఉండాలని,. మన గ్రామాలు అభివృద్ధి చెందాలని,. మన తెలంగాణ సంస్కృతి తరతరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు కోమటిరెడ్డి లక్ష్మి గారు...

బతుకమ్మ ఆడే ప్రతి మహిళ వద్దకు వెళ్లి పలకరించారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు...తమ దగ్గరికి వచ్చిన తమ అబిమాన నాయకున్ని ప్రతి మహిళ ఆత్మీయంగా పలకరించారు..

బతుకమ్మ ఆడి అలసిన మహిళలకు కడుపునిండా భోజనం చేసి వెళ్లే విదంగా ఏర్పాట్లు చేయడంతో ప్రతి ఒక్కరు భోజనాలు చేసి తమ గ్రుహాలకు తరలి వెళ్లారు..

ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా మహిళ లతో పాటు నియోజకవర్గ ముఖ్య నాయకులు హాజరయ్యారు....

X లో చూడండి ›

సంబంధిత వార్తలు