లలిత కళా తోరణంలో బతుకమ్మ వేడుకలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పాల్గొన్న మంత్రులు జూపల్లి, పొన్నం
బతుకమ్మ పాటలను ఆవిష్కరించిన మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు నగరంలో సందడిగా సాగుతున్నాయి. పబ్లిక్ గార్డెన్‌లోని లలిత కళా తోరణంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పర్యాటక శాఖ సమర్పణలో ప్రత్యేకంగా రూపొందించిన బతుకమ్మ పాటలను మంత్రులు ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పేలా ఈ పాటలను రూపొందించారు.
కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.





