40 మందిని సురక్షితంగా నిలిపి.. తాను ప్రాణం విడిచిన ఆర్టీసీ డ్రైవర్ శివ!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సును నడుపుతున్న జె. శివకు తుని దాటిన తర్వాత తీవ్ర ఛాతీనొప్పి వచ్చింది.
ఆ బాధలోనూ నియంత్రణ కోల్పోకుండా, నక్కపల్లి సమీపంలో బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా ఆపారు. బస్సులోని 40 మంది ప్రయాణికులను ప్రమాదం నుంచి కాపాడారు.
అనంతరం కుప్పకూలిన శివను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. గుండెపోటుతో మరణించినట్లు అనుమానిస్తున్నారు.
తీవ్ర అస్వస్థతలోనూ ప్రయాణికుల భద్రతను కాపాడిన ఆయన సమయస్ఫూర్తికి వందనం. శివ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. 🙏





