బైక్ టాక్సీలకు మహారాష్ట్ర సర్కార్ డెడ్‌లైన్.. జూలై 2027 నాటికి 100% ఈవీలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మహారాష్ట్రలో ఓలా, ఉబెర్, రాపిడో వంటి బైక్-టాక్సీలు జూలై 2027 నాటికి 100% ఈవీలుగా మారాలని సర్కార్ ఆదేశం..
మొత్తం 9 నెలల ట్రాన్సిషన్ గడువు కేటాయించిన సర్కార్..
ప్రస్తుత పెట్రోల్ బైక్ ఆపరేటర్లకు మొదటి దశలో 6 నెలల గడువు..
మహారాష్ట్ర బైక్ టాక్సీ రూల్స్, 2025 కింద తాత్కాలిక లైసెన్స్ ఉన్నవారికి అదనంగా మరో 3 నెలల సమయం..
అగ్రిగేటర్లు 2030 వరకు సమయం కోరగా.. కేవలం 9 నెలలే అనుమతించిన సర్కార్..
తక్కువ గడువు ఇవ్వడంపై బైక్-టాక్సీ అసోసియేషన్ల తీవ్ర వ్యతిరేకత..
రైడర్లు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారైనందున వెంటనే ఈవీలు కొనలేరని స్పష్టం..
ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత, బ్యాటరీ, వాహన జీవితకాలంపై ఆందోళన వ్యక్తం.
మహారాష్ట్రలోని పెట్రోల్ బైక్-టాక్సీ రైడర్లపై తీవ్ర ప్రభావం పడనుంది





