తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
ఐటీ సోదాలతో లింక్ లేదు.. తేల్చిచెప్పిన రకుల్ ప్రీత్ సింగ్రూ.1,090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్.. స్పాట్‌ను పరిశీలించిన GHMC కమిషనర్ కర్ణన్భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నేడు గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. అంతిమ లబ్ధిదారులెవరో తెలిపోయింది. రూ.40 కోట్ల సుపారీపై గొడ్డలి పార్టీ అధినేత సమాధానం చెప్పాలివరంగల్ జిల్లా: భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో విద్యుత్ టవర్ ఎక్కి యువకుడి ఆందోళన..హైదరాబాద్‌ జీసీసీ క్యాపిటల్‌గా ఎదుగుతోందిపాఠశాలల మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్‌మెంట్‌పై మంత్రి నారా లోకేష్ సమీక్షతిరుపతి: తిరుమలలోఐటీ సోదాలతో లింక్ లేదు.. తేల్చిచెప్పిన రకుల్ ప్రీత్ సింగ్రూ.1,090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్.. స్పాట్‌ను పరిశీలించిన GHMC కమిషనర్ కర్ణన్భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నేడు గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు.వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. అంతిమ లబ్ధిదారులెవరో తెలిపోయింది. రూ.40 కోట్ల సుపారీపై గొడ్డలి పార్టీ అధినేత సమాధానం చెప్పాలివరంగల్ జిల్లా: భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో విద్యుత్ టవర్ ఎక్కి యువకుడి ఆందోళన..హైదరాబాద్‌ జీసీసీ క్యాపిటల్‌గా ఎదుగుతోందిపాఠశాలల మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్‌మెంట్‌పై మంత్రి నారా లోకేష్ సమీక్షతిరుపతి: తిరుమలలో
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్‌ జీసీసీ క్యాపిటల్‌గా ఎదుగుతోంది

ప్రత్యేక కథనంజాతీయం
హైదరాబాద్‌ జీసీసీ క్యాపిటల్‌గా ఎదుగుతోంది
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

– ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ జాయింట్‌ సెక్రటరీ అనుదీప్‌ దురిశెట్టి

ఫొటో.. ప్లానెన్‌ సంస్థలో ది సీక్వెల్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ జాయింట్‌ సెక్రటరీ అనుదీప్‌ దురిశెట్టి

దేశంలోని హైదరాబాద్‌ నగరం జీసీసీ(గ్లోబల్‌ క్యాపబిలిటి సెంటర్‌) క్యాపిటల్‌గా ఎదుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ జాయింట్‌ సెక్రటరీ అనుదీప్‌ దురిశెట్టి అన్నారు. సోమవారం రాయదుర్గంలోని అరబిందో గెలాక్సీ ఐటీ భవనంలో ప్లానాన్‌ ఇండియా సంస్థ విస్తరించిన కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు నిర్వహించిన ది సీక్వెల్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌కు 515 జీసీసీలు వచ్చాయని మరో 500 జీసీసీలు వచ్చే విధంగా పలు సంస్థలతో, కంపెనీలో ప్రభుత్వం నుంచి మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరికొత్త జీసీసీ పాలసీ కూడా రాబోతున్నదని అది అన్ని కంపెనీలకు ఎంతో దోహదడం చేయడంతో పాటు వ్యాపార, ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుందని ఆయన అన్నారు. ఇన్నోవేటివ్‌ గ్లోబల్‌ ప్రొడక్ట్స్‌ ఇక్కడి నుంచి తయారు చేసే విధంగా ఎన్నో కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ప్రంపంచలోని అనేక దేశాలో హైదరాబాద్‌ నగరం వైపు చూస్తున్నాయని ఆయా కంపెనీలకు కావాల్సిన అన్ని వసతులను ప్రభుత్వం కల్పించేందుకు ముందుకు వస్తున్నదని అన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తో ప్రపంచం పరుగులు తీస్తున్నప్పటికీ ఇక్కడి కంపెనీలు కూడా దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమని ఆయన అన్నారు. ఇన్నోవేషన్‌ ఇకో సిస్టమ్‌ను తాము ప్రోత్సహిస్తున్నట్లు, వచ్చే అయిదేళ్ళలో డేటా సెంటర్ల అభివృద్ధికి పలు ప్రణాళికలు రూపొందించి అమలు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలోనే ఇన్వెస్ట్‌ తెలంగాణ సమ్మిట్‌ కూడా నిర్వహిబోతున్నామని అనేక కంపెనీలు ఇందులో పాల్గొనబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీజీటీఎస్‌ చైర్మన్‌ మన్నె సతీష్‌ కుమార్, ప్లానాన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ హెంక్‌ లారాకర్, స్టాట్యూటరి డైరెక్టర్‌ కిరణ్‌ మధునాపంతుల, ప్లానాన్‌ ఇండియా సెంటర్‌ హెడ్‌ రాధికారెడ్డి గంగారపు, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు శృతి, రవి సంబోజు తదితరులు పాల్గొన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు

తిరుపతి: తిరుమలలో

జాతీయం · 05 Oct, 04:03 PM