పాఠశాలల మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్‌మెంట్‌పై మంత్రి నారా లోకేష్ సమీక్ష

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
ఏడాదిలోగా రాష్ట్రంలోని అన్ని వన్‌స్టార్ పాఠశాలలను టూ స్టార్‌కు అప్‌గ్రేడ్ చేయాలని మంత్రి లోకేష్ ఆదేశం
2029 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను 4 స్టార్ స్థాయికి చేర్చేలా ప్రణాళిక
రాష్ట్రవ్యాప్తంగా కనీసం వెయ్యి ప్రభుత్వ పాఠశాలలను 5 స్టార్ స్థాయికి చేర్చాలని మంత్రి లోకేష్ ఆదేశం
నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్ల అభివృద్ధికి ప్రణాళికలు
ప్రస్తుతం రాష్ట్రంలో 1,685 వన్ స్టార్ పాఠశాలలు, 15,618 టూ స్టార్
19,099 త్రీ స్టార్, 7,172 ఫోర్ స్టార్ పాఠశాలలు ఉన్నాయన్న అధికారులు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పురోగతిపై డీఈవోలు, ఎంఈవోలు, సీఆర్‌పీలకు బాధ్యతలు
రాష్ట్రంలోని 7 వేల హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై దృష్టి
అకడమిక్ సంస్కరణలు పూర్తయ్యాయి, ఇక అభ్యసన ఫలితాలపై అధికారులు, ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలి
ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ లక్ష్యం
ఏఐ ద్వారా నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించేలా చర్యలు
జర్మన్, జపనీస్ భాషల్లో శిక్షణ ఇచ్చి విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి... లోకేష్





