కొండారెడ్డిపల్లిలో సోలార్ ఆదాయం.. దసరా దావత్ చేసుకున్న గ్రామస్తులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటికి సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సీఎం అయ్యాక తన సొంత గ్రామం కోసం ఏదైనా చేయమని భట్టి గారిని కోరినట్లు చెప్పారు.
భట్టి గారు గ్రామంలో వంద శాతం సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేయించారని సీఎం పేర్కొన్నారు.
దసరాకు గ్రామానికి వెళ్లినప్పుడు, ప్రజలు అదనపు విద్యుత్తును ప్రభుత్వానికి అమ్ముతున్నారని సీఎం తెలిపారు.
సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన అదనపు విద్యుత్తును ప్రభుత్వానికి అమ్మగా, గ్రామస్తుల ఖాతాల్లో రూ. 15,000 నుండి రూ. 25,000 వరకు జమ అయ్యాయి.
ఆ డబ్బుతో గ్రామస్తులు దసరా దావత్ చేసుకున్నారని సీఎం పేర్కొన్నారు.





