ఆంధ్రప్రదేశ్‌లో రూ.7,000 కోట్ల పెట్టుబడితో Haier India తయారీ కేంద్రం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో 250 ఎకరాల్లో కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో రూ. 4,500 కోట్లు, రెండో దశలో రూ. 2,500 కోట్లు 2032 నాటికి పెట్టుబడి పెట్టనున్నారు.
ఇక్కడ ఏసీలు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు ఇతర గృహోపకరణాలు తయారు చేస్తారు.
2032 నాటికి 6,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 15,000 పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
2028 నాటికి మొదటి దశ కార్యకలాపాలు ప్రారంభం కానుండగా, అదే సమయానికి రూ. 22,000 కోట్ల ఆదాయాన్ని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
చెన్నై-తిరుపతి పారిశ్రామిక కారిడార్‌లో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది.
ఈ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌ను తయారీ హబ్‌గా బలోపేతం చేయడంతో పాటు, అనుబంధ పరిశ్రమలను ఆకర్షించి, ప్రాంతీయ ఉపాధి అవకాశాలను పెంచుతుందని అంచనా.





