యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అవార్డ్స్–2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు యువ ఫిలిం మేకర్లను అభినందించారు.
వాతావరణ మార్పులు, నీటి సంక్షోభం, ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించే లఘు చిత్రాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక అని పేర్కొంటూ, యువ సినీ ప్రతిభను ప్రోత్సహించి హైదరాబాద్ను భారతీయ సినిమా రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.





