క్యూనెట్ ప్రమోటర్ డిగ్ విజయ్ సింగ్ అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
క్యూనెట్ కేసులో ఏ-11గా ఉన్న ప్రమోటర్ డిగ్ విజయ్ సింగ్ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్ఎం, ఈ-కామర్స్ పేరుతో పది వేల కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిని హైదరాబాద్ తరలించి కోర్టులో హాజరుపరచనున్నారు.





