కీసర పోలీస్ ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు

ఇన్స్పెక్టర్ అర్పకపల్లి అంజనేయులుపై ఏసీబీ కేసు
హైదరాబాద్‌తో పాటు నాలుగు ఇతర ప్రాంతాల్లోనూ ఏసీబీ సోదాలు
ఇన్స్పెక్టర్ నివాసం, కార్యాలయం, బంధువులు, బినామీలకు సంబంధించిన ప్రాంతాల్లో తనిఖీలు
2.28 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అంచనా
సోదాల్లో 7 లక్షల నగదు స్వాధీనం
60 తులాల బంగారు ఆభరణాలు గుర్తింపు.. విలువ సుమారు 5 లక్షలు
6.50 లక్షల విలువైన మారుతి విటారా బ్రెజ్జా కారు గుర్తింపు
10 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు గుర్తింపు
సరూర్‌నగర్‌లో 150 గజాల చొప్పున రెండు ప్లాట్లు.. పాత ఇల్లు గుర్తింపు
ఎల్బీనగర్ మాన్సూరాబాద్ సీఆర్ ఎన్‌క్లేవ్‌లో 240 గజాల స్థలంలో ఇల్లు
పెరూర్ గ్రామంలో 180 గజాల స్థలంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు
మిర్యాలగూడ హాలియాలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి గుర్తింపు
గుర్తించిన ఆస్తుల అధికారిక విలువ సుమారు 1.20 కోట్లు.. మార్కెట్ విలువ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం
హాలియాలో మరిన్ని వ్యవసాయ భూములు ఉన్నట్లు ఏసీబీ విచారణలో వెల్లడి
గతంలో 8 లక్షల లంచం డిమాండ్.. 5 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన ఇన్స్పెక్టర్
సెప్టెంబర్ 17న అరెస్టు.. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఇన్స్పెక్టర్
ప్రస్తుత ఆస్తుల కేసులో పీటీ వారెంట్‌పై కోర్టులో హాజరుపరచనున్న ఏసీబీ





