మదనపల్లెలో ఆప్యాయంగా పలకరించుకున్న ప్రత్యర్థులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా బరిలో ఉన్న టీడీపీ, వైసీపీ నేతలు ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు, వైసీపీ అభ్యర్థి జింకా చలపతి ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ప్రత్యర్థులైనప్పటికీ సరదాగా పలకరించుకోవడం అందరినీ ఆకట్టుకుంది.





