పులివెందులలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కడప జిల్లా పులివెందులలో నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒక్కసారిగా నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ను ప్రయోగించారు.





