నాసిక్లో కుళ్లిపోయిన టన్నుల కొద్దీ ఉల్లి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మహారాష్ట్రలోని నాసిక్లో రైతుల నుంచి సేకరించిన టన్నుల కొద్దీ ఉల్లిపాయలు కుళ్లిపోయాయి. నాఫెడ్, ఎన్సీసీఎఫ్ అధికారుల నిర్లక్ష్యంతో సుమారు 80 వేల మెట్రిక్ టన్నుల ఉల్లి పాడైపోయింది. కిలో రూ. 23 వెచ్చించి కొనుగోలు చేసిన సరుకు వృథా కావడంతో 184 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కుళ్లిన ఉల్లిని ఎరువుల తయారీ కంపెనీలకు కిలో రూపాయికే అమ్మెందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.





