సాధువుల వేషంలో గంజాయి రవాణా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో భారీగా గంజాయి పట్టుబడింది. సాధువుల వేషంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 10 కిలోల గంజాయితో పాటు మొబైల్, నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిని గుంటూరు జిల్లాకు చెందిన బత్తుల శ్రీనివాసరావు, ద్రాక్షారామానికి చెందిన సాయిరెడ్డిగా గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.





