జీవీఎంసీ ఎన్నికల్లో విజయం మాదేనన్న బొత్స

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 120 వార్డుల్లో 90 శాతానికి పైగా స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పారు. ఇప్పటికే 74 మంది అభ్యర్థులను ప్రకటించామని.. త్వరలో మిగిలిన జాబితా విడుదల చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని బొత్స ప్రశ్నించారు.





