రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసు ఛేదింపు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ చిక్కడపల్లి పరిధిలో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. వ్యాపారి శ్రీనివాసరావును కిడ్నాప్ చేసిన తొమ్మిది మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ రక్షితమూర్తి తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ఏ1 శ్రీకాంత్ కిడ్నాప్కు ప్లాన్ చేశాడన్నారు. కుటుంబసభ్యుల నుంచి 1.30 కోట్లు వసూలు చేయగా.. నిందితుల నుంచి 1.07 కోట్ల నగదు, ఐదు వాహనాలను సీజ్ చేశామన్నారు.





