సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవా కన్నుమూత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయనను చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సినీ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన దేవా 400కు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలకు కూడా స్వరాలు సమకూర్చారు.
రజనీకాంత్ ‘బాషా’, తెలుగులో ‘తొలిప్రేమ’, ‘మాస్టర్’, ‘నాగ’ వంటి చిత్రాలకు ఆయన అందించిన సంగీతం ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
దేవా మృతితో దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది.





