తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవా కన్నుమూతరాజరాజేశ్వరి దేవి అలంకారంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి.. భక్తులతో కిటకిటలాడిన ఆలయంవిజయవాడలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పర్యటనశంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. 47 మంది విద్యార్థులతో వచ్చిన విమానంలో కలకలం!గేమ్ కూడా హైటెక్! కార్డులు పంచేందుకూ మెషీనా!.. గేమ్‌లో ఫన్ డబుల్, చీటింగ్‌కు ఛాన్స్ జీరో!ఆసియా క్రీడల్లో హాకీ స్వర్ణం.. క్రీడాకారులకు రూ.11 లక్షల బహుమతిరీల్ కోసం రిస్క్.. ప్రాణం పోయేంత పని! తృటిలో తప్పిన ప్రమాదం“మోదీతో వంద విభేదాలు ఉన్నా.. దేశాన్ని అవమానిస్తే ఊరుకోను” — ఒవైసీసినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవా కన్నుమూతరాజరాజేశ్వరి దేవి అలంకారంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి.. భక్తులతో కిటకిటలాడిన ఆలయంవిజయవాడలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పర్యటనశంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. 47 మంది విద్యార్థులతో వచ్చిన విమానంలో కలకలం!గేమ్ కూడా హైటెక్! కార్డులు పంచేందుకూ మెషీనా!.. గేమ్‌లో ఫన్ డబుల్, చీటింగ్‌కు ఛాన్స్ జీరో!ఆసియా క్రీడల్లో హాకీ స్వర్ణం.. క్రీడాకారులకు రూ.11 లక్షల బహుమతిరీల్ కోసం రిస్క్.. ప్రాణం పోయేంత పని! తృటిలో తప్పిన ప్రమాదం“మోదీతో వంద విభేదాలు ఉన్నా.. దేశాన్ని అవమానిస్తే ఊరుకోను” — ఒవైసీ
వాతావరణం
📅 తేదీ వారీగా

విజయవాడలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పర్యటన

ప్రత్యేక కథనంజాతీయం
విజయవాడలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పర్యటన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేడు విజయవాడలో పర్యటిస్తున్నారు. కనకదుర్గమ్మను దర్శించుకుని.. విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొంటారు. ఏపీ సీఎం చంద్రబాబుతోనూ ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. భోపాల్ నుంచి గన్నవరం చేరుకోనున్న మోహన్ యాదవ్.. రాత్రికి తిరిగి ప్రయాణమవుతారు.

[2] నెల్లూరు మేయర్ అభ్యర్థుల నామినేషన్లు నేడే

నెల్లూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కూటమి మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇద్దరూ ఇవాళే తమ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించనున్నారు.

[3] పలాస, ఇచ్చాపురం అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీలు

పలాస కాశీబుగ్గ, ఇచ్చాపురం మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థులను టీడీపీ, వైసీపీ ఖరారు చేశాయి. పలాస టీడీపీ అభ్యర్థిగా వజ్జ బాబూరావు భార్య గంగాభవాని, ఇచ్చాపురం అభ్యర్థిగా ఆశి లీలారాణి పేర్లను ప్రకటించింది. ఇచ్చాపురం వైసీపీ అభ్యర్థిగా పిలక రాజ్యలక్ష్మి ఇప్పటికే నామినేషన్ వేశారు. పలాస వైసీపీ అభ్యర్థిగా తలాసు శ్రీపద్మ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

[4] ఎన్పీఏలో 78వ బ్యాచ్ ఐపీఎస్‌ల దీక్షాంత్ పెరేడ్

నేషనల్ పోలీస్ అకాడమీలో 78వ బ్యాచ్ ఐపీఎస్‌ల దీక్షాంత్ పెరేడ్ జరుగుతోంది. ఫేజ్ వన్ శిక్షణ పూర్తి చేసుకున్న 151 మంది ఆఫీసర్లు ఈ పెరేడ్‌లో పాల్గొంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు పది మంది ఐపీఎస్‌లు కేటాయించగా.. ఏపీకి ఎనిమిది, తెలంగాణకు ఇద్దరు దక్కారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.

[5] నేడు ఏపీలో చైనా రాయబారి జు ఫీహాంగ్ పర్యటన

చైనా రాయబారి జు ఫీహాంగ్ నేడు ఏపీలో పర్యటిస్తున్నారు. ఉదయం ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను ఆయన దర్శించుకుంటారు. సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశమైన అనంతరం.. విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొంటారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన చైనాకు తిరుగు ప్రయాణమవుతారు.

[6] తెలంగాణలో రికార్డు బద్దలుకొట్టిన విద్యుత్ డిమాండ్

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డ్ బ్రేక్ చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 20 వేల 3 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. ఒక్కరోజులోనే 334 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీ ఉష్ణోగ్రత 25 డిగ్రీల వద్దే ఉండాలని అధికారులు ఆదేశించారు.

[7] హనుమకొండలో ఐటీ టవర్లు ఏర్పాటు చేస్తామన్న శ్రీధర్ బాబు

హనుమకొండలో త్వరలోనే ఐటీ టవర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వరంగల్ ప్రజలు త్వరలో విమానాశ్రయాన్ని చూడబోతున్నారని చెప్పారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని మంత్రి కొనియాడారు.

[8] ఏలూరు జిల్లాలో పెద్దపులి కదలికలపై అధికారుల నిఘా

X లో చూడండి ›

సంబంధిత వార్తలు