తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
దసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపువనపర్తిలో దారుణం.. భర్త హత్యకు భార్య, ప్రియుడి కుట్రఅమెరికాలో హెచ్-1బీ వేతన పరిమితి పెంపు.. 1.40 లక్షల డాలర్లకు పెంచాలని బిల్లున్యూజిలాండ్ పర్యటనకు భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ.. శుభ్‌మన్, శ్రేయస్ కెప్టెన్సీన్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా రీఎంట్రీ.. వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్భారత నౌకాదళంలోకి చేరిన 'INS సమర్థక్'.. ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి నౌకభద్రకాళి మాడవీధుల్లో భారీ రథందసరా వేళ హైదరాబాద్ నుంచి పల్లెబాట.. భారీగా ట్రాఫిక్ జామ్అనంతపురం జిల్లా: అనంతపురం మేయర్ స్థానం బిజెపికి కేటాయింపువనపర్తిలో దారుణం.. భర్త హత్యకు భార్య, ప్రియుడి కుట్రఅమెరికాలో హెచ్-1బీ వేతన పరిమితి పెంపు.. 1.40 లక్షల డాలర్లకు పెంచాలని బిల్లున్యూజిలాండ్ పర్యటనకు భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ.. శుభ్‌మన్, శ్రేయస్ కెప్టెన్సీన్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా రీఎంట్రీ.. వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్భారత నౌకాదళంలోకి చేరిన 'INS సమర్థక్'.. ప్రైవేట్ రంగంలో నిర్మించిన తొలి నౌకభద్రకాళి మాడవీధుల్లో భారీ రథం
వాతావరణం
📅 తేదీ వారీగా

వనపర్తిలో దారుణం.. భర్త హత్యకు భార్య, ప్రియుడి కుట్ర

క్రైమ్వనపర్తి
వనపర్తిలో దారుణం.. భర్త హత్యకు భార్య, ప్రియుడి కుట్ర
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

వనపర్తి జిల్లా కేంద్రంలోని బ్రహ్మం గారి వీధిలో దారుణం జరిగింది. పెళ్లయిన నెల రోజులకే భర్తను చంపేందుకు భార్య, ఆమె ప్రియుడు కుట్ర పన్నారు.

ప్రియుడు షాకీర్, అతని స్నేహితుడు మహేశ్వర్ లాల్‌తో కలిసి భార్య షాహేదా ప్లాన్ చేయగా, హైదరాబాద్ నుంచి వనపర్తికి వచ్చి హత్యాయత్నం చేశారు.

అర్ధరాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న భర్త షబ్బీర్ ముఖంపై HIT స్ప్రే చల్లారు. షాహేదా భర్త చేతులు పట్టుకోగా, ప్రియుడు షాకీర్ బెల్టుతో గొంతు బిగించి చంపేందుకు యత్నించాడు. మరో నిందితుడు మహేశ్వర్ లాల్ బయట పల్సర్ బైక్‌పై వేచి ఉన్నాడు.

షబ్బీర్ గట్టిగా అరవడంతో సోదరుడు బయటకు వచ్చాడు. కుటుంబ సభ్యులు తలుపు తట్టడంతో నిందితుల ప్రయత్నానికి ఆటంకం ఏర్పడింది. బాధితుడు నిందితులను తోసేసి ప్రాణాలతో బయటకు వచ్చాడు.

పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందడంతో పెట్రోలింగ్ పోలీసులు రంగంలోకి దిగారు. భార్య, ప్రియుడు సహా స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు