డిండి లిఫ్ట్ రద్దు కోరుతూ ధర్నా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని రద్దు చేయాలంటూ కల్వకుర్తి పట్టణంలో పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు న్యాయం చేయాలని నాయకులు రోడ్డుపై బైఠాయించారు. స్థానిక ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని నినదించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు.





