తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
చిత్తూరు: పుంగనూరు ఘటనలపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశం.దసరా ప్రయాణికులకు ఊరట.. 7 వేల ప్రత్యేక బస్సులుజమ్మూకశ్మీర్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. మహిళా అధికారిపై బూతులుమంగళహాట్‌లో భారీగా అక్రమ బాణసంచా సీజ్.. రూ.10 లక్షల సరుకు స్వాధీనంజలపాతం వద్ద సరదాగా మొదలైన ట్రిప్.. క్షణాల్లో విషాదంగా మారింది!పిల్లల కళ్లెదుటే భార్యపై కత్తితో దాడి.. బద్వేల్లో దారుణ హత్యకిట్‌క్యాట్ ఓపెన్ చేస్తే షాక్!.. చాక్లెట్‌లో పురుగులంటూ వీడియో వైరల్అక్రమ కట్టడాలపై GHMC ఉక్కుపాదం.. 473 నిర్మాణాలు రాడార్‌లో!చిత్తూరు: పుంగనూరు ఘటనలపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశం.దసరా ప్రయాణికులకు ఊరట.. 7 వేల ప్రత్యేక బస్సులుజమ్మూకశ్మీర్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. మహిళా అధికారిపై బూతులుమంగళహాట్‌లో భారీగా అక్రమ బాణసంచా సీజ్.. రూ.10 లక్షల సరుకు స్వాధీనంజలపాతం వద్ద సరదాగా మొదలైన ట్రిప్.. క్షణాల్లో విషాదంగా మారింది!పిల్లల కళ్లెదుటే భార్యపై కత్తితో దాడి.. బద్వేల్లో దారుణ హత్యకిట్‌క్యాట్ ఓపెన్ చేస్తే షాక్!.. చాక్లెట్‌లో పురుగులంటూ వీడియో వైరల్అక్రమ కట్టడాలపై GHMC ఉక్కుపాదం.. 473 నిర్మాణాలు రాడార్‌లో!
వాతావరణం
📅 తేదీ వారీగా

చిత్తూరు: పుంగనూరు ఘటనలపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశం.

ప్రత్యేక కథనంజాతీయం
చిత్తూరు: పుంగనూరు ఘటనలపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశం.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాష్ట్రంలోనే పుంగునూరుకు ప్రత్యేక చరిత్ర ఉంది.

2021 లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో అప్పటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల చేత నామినేషన్ వేయించలేదు.

అందరినీ అడ్డగించి స్థానిక సంస్థల ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంది.

అప్పుడు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తే అడ్డగించాలని ప్రిపేర్ అయ్యారు.

ఉదయం 9 గంటల సమయంలో సమాచారం తెలుసుకొని ఎంపీని గంట పాటు ఆపాం.

రాజంపేట ఎంపీ మిథున్ తన బలగంతో ఉదయం 10 గంటల సమయంలో ఎంపీ మిథున్ 7 వాహనాల్లో బయలుదేరారు.

దర్గా సమీపంలో ఆ తర్వాత చెరువు కట్ట పై కూడా అడ్డగించే ప్రయత్నం చేశారు.

నామినేషన్ కేంద్రం వద్ద గేట్ లను తీసే లోపే అమాంతంగా 7 వాహనాల్లో ఎంపీ లోపలికి వెళ్లారు.

తన వెంట వచ్చిన వారితో ఎంపీ ఆర్వో రూమ్ లోకి వెళ్లారు.

ఎంపీ వాహనాల్లో వచ్చినవాళ్లు నలుగురు రౌడీషీటర్లు ఉన్నారు.

సాయి కుమార్ రెడ్డి, జస్వంత్, షేక్ ఇస్మాయిల్,

వంశీకృష్ణ లు మారణాయుధాలతో అక్కడున్న వారిపై దాడికి పాల్పడ్డారు.

ఎదురుగా వచ్చే వ్యక్తులపై పక్కా ప్రణాళిక తో దాడి చేసారు.

ఈ లోపు బయట ఉన్న వ్యక్తులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు.

చెదరగొట్టే ప్రయత్నంలో డీఎస్పీ 3 రౌండ్లు గాలిలో కాల్పులు కూడా జరిపారు.

12 గంటల సమయంలో ఘటన స్థలానికి ఎస్పీ చేరుకొని సురక్షితంగా ఎంపీ మిథున్ ను పుంగనూరు దాటించారు.

ఈ మొత్తం వ్యవహారంపై 3 కేసులు నమోదయ్యాయి.

టిడిపికి చెందిన 13 మంది గాయపడ్డారు.

కారుతో గుద్దడం వల్ల గాయపడ్డ వ్యక్తి, డీఎస్పీ తోపాటు మరో వ్యక్తి ఇచ్చిన

ఫిర్యాదు మేరకు మూడు కేసులు నమోదు చేశాం.

కోయ ప్రవీణ్ డీఐజీ, కర్నూలు రేంజ్.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు